తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సంబంధించిన వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్‌లో చీలికలకు దారి తీస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారనే వార్తలు విస్తృతంగా వినిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనపై పార్టీ సీనియర్లు అసంతృప్తని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎష్ఎస్), తెలుగుదేశం పార్టీ నేపథ్యం గల రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను అప్పగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని అధిష్ఠానానికి హెచ్చరిస్తున్నారు
#Telangana
#TPCC
#RevanthReddy
#Congress
#Vhanumantharao