Vaikunta Ekadasi Festival Celebration in Andhra Pradesh. amid Covid-19 restrictions.
#Andhrapradesh
#Annavaram
#VaikuntaEkadasi
#VaikuntaEkadasi2020
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల సరికొత్త శోభను సంతరించుకుంది. గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోతోంది. తిరుమల ఆలయ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా ఉత్తరద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచనున్నారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం గుండా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులకు పరిమితంగా దర్శనానికి అనుమతి ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ సంఖ్యను పెంచారు.