India Vs Australia : key details in Mohammed Siraj's journey from tennis-ball cricket to Boxing Day debut
#Siraj
#MohammedSiraj
#Teamindia
#MarnusLabuschagne
#CameronGreen
#Indvsaus
#Melbournetest
#IndiaVsAustralia
అతడి లక్ష్యం భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడటం. ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైయ్యాయి. అయినా ఆటుపోట్లకు ఎదురీదుతూ కష్టాల కడలిని దాటుకుంటూ.. తన కలల ప్రయాణంలోని గమ్యాన్ని చేరాడు. అతడు మరెవరో కాదు మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. ఆట కోసం అన్నీ తానై నిలిచిన తండ్రి అనంతలోకాలకు వెళ్లినా.. సిరాజ్ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. తాను ఎంతగానో ప్రేమించే నాన్న కడచూపునకు దూరమైనా.. భారత్‌కు ఆడాలన్న కాంక్ష అతడిని ముందుకు నడిపించింది. గుండెలోతుల్లోని దుఃఖాన్ని దిగమింగుకుంటూ తొలిసారి టెస్టుల్లో భారత్ తరఫున సిరాజ్ అరంగేట్రం చేశాడు.