సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా కొన్ని నెలల నుంచి భారత్, చైనా మధ్య బిజినెస్ వ్యవహారాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భద్రతా వ్యవహారాల కారణంగా ఆ దేశానికి చెందిన అనేక వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం.. డ్రాగన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా టెలికాం ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. చైనాలో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. భద్రత విషయంలో నమ్మదగిన కొన్ని కంపెనీల లిస్టు తయారు చేయడంతో పాటు కొన్ని కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
#IndiavsChina
#IndiachinaBorder
#Covid19Vaccine
#IndiaChinaStandOff
#DonaldTrump
#PSLVC50