GHMC Elections 2020 : BJP MP Arvind Dharmapuri Comments on cm kcr over pm narendra modi visits hyderabad.
#PmModi
#Modi
#Hyderabad
#Bharatbiotech
#Cmkcr
#Kcr
#Telangana
#Ghmcelections2020
#ArvindDharmapuri
అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ... ఇటు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఒకేరోజు సీఎం,పీఎం కార్యక్రమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాని అధికారిక పర్యటనకు సీఎంను దూరం పెట్టడం వివాదాస్పదమవుతోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం ప్రత్యేక సమాచారం ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సంప్రాదాయాలకు,ప్రోటోకాల్‌కు తిలోదకాలిచ్చేలా ప్రధాని వ్యవహరించిన తీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాష్ట్ర ప్రభుత్వం,ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.