జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్ష్, తయారు చేసిన ఎలక్ట్రిక్ సూపర్ కార్ "టేకాన్" లేటెస్ట్ గా ఒక వరల్డ్ రికార్డును సృష్టించింది. పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనే లాంగెస్ట్ డ్రిఫ్ట్ కోసం కొత్త ప్రపంచ రికార్డును సృష్టించినట్లు కంపెనీ ప్రకటించింది.
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ మొత్తం 42.171 కిలోమీటర్ల దూరంలో 55 నిమిషాల పాటు డ్రిఫ్ట్ చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. జర్మనీలోని హాకెన్‌హీమ్రింగ్‌లో ఉన్న పోర్ష్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో ఈ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం జరిగింది.
పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ వరల్డ్ రికార్డ్ గురించి పూర్తి సమాచారం తెలుసుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.