పట్టపగలు అందరూ ఉండగానే ఏభయం లేకుండా నడిరోడ్డులో దొంగతనం జరిగింది. ఈ దొంగతనం జరిగినట్టు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అది అందరికీ తెలుసు. కానీ ఎవరూ దాని గురించి కంప్లయింట్ ఇవ్వలేరూ. కానీ వీడిమో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏం దొంగతనం జరిగింది. ఎవరు చేశారని అనుకుంటున్నారా. ఇదొక అరటి పండ్ల దొంగ ఏనుగు కథ. అవును.. మీరు చదివింది నిజమే. ఒక దొంగ ఏనుగు రోడ్డుపై వెళ్తున్న కారును ఆపి మరీ అరటి పండ్లను కాజేసింది. శ్రీలంక లోని కటరంగమా ప్రాంతంలోని రోడ్డుపై ఈ సంఘటన జరిగింది.