హ్యుందాయ్ కంపెనీ తన ట్యుసాన్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో 2015 లో తిరిగి విడుదల చేసింది. ట్యుసాన్ భారత మార్కెట్లో కొరియా కార్ల తయారీదారుల మొదటి ఎస్‌యూవీ. లాంచ్ సమయంలో ఈ కారుకు మంచి స్పందన లభించింది మరియు మంచి సంఖ్యలో విక్రయించబడింది. కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ట్యుసాన్ ఎస్‌యూవీకి అనేక ఫేస్‌లిఫ్ట్‌లను ఇచ్చింది.
ట్యుసాన్ ఎస్‌యూవీ యొక్క లేటెస్ట్ ఫేస్‌లిఫ్టెడ్ అవతార్ ఈ ఏడాది ప్రారంభంలో 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జూలై నెలలో, హ్యుందాయ్ ఫేస్‌లిఫ్టెడ్ ట్యుసాన్‌ను రూ. 22.3 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది చూడటానికి 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కారులాగా ఉంటుంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు అన్ని నిలిచిపోయాయి. ఆ సమయంలో మేము కొత్త ట్యుసాన్ ఎస్‌యూవీ డ్రైవ్‌ను టెస్ట్ చేయలేకపోయాము. కానీ ఇప్పుడు మేము ఫేస్‌లిఫ్టెడ్ ట్యుసాన్ జిఎల్‌ఎస్ 4 డబ్ల్యుడి ని డ్రైవ్ చేసాము. ఈ కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి మరింత సమచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.