కొత్త హ్యుందాయ్ శాంట్రో సిఎన్‌జి వేరియంట్స్ విడుదల

2020-10-15 10

హ్యుందాయ్ తన ఎంట్రీ లెవల్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ యొక్క రెండు కొత్త సిఎన్‌జి మోడళ్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
హ్యుందాయ్ శాంట్రో మాగ్నా సిఎన్‌జి ధర రూ. 5.89 లక్షలు. హ్యుందాయ్ శాంట్రో స్పోర్ట్జ్ సిఎన్‌జి ధర రూ.6.00 లక్షలు.

కొత్త వచ్చిన హ్యుందాయ్ శాంట్రో సిఎన్‌జి వేరియంట్లు దాని పెట్రోల్ వేరియంట్ల మాదిరిగానే ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. హ్యుందాయ్ శాంట్రో మాగ్నా సిఎన్‌జిలో 2-డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మాన్యువల్ ఏసి, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.