కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

2020-10-15 353

బ్రిటిష్ లగ్జరీ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో డిఫెండర్ రేంజ్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ‘డిఫెండర్’ నేమ్‌ప్లేట్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఇటీవల మేము ఈ ఎస్‌యూవీని మొదటిసారి పరిశీలించాము. సరికొత్త డిఫెండర్ నిజంగా చాలా అద్భుతమైనది మరియు ఇది ఎటువంటి రహదారులలో అయినా ప్రయాణించగలదు.

డిఫెండర్ డిఫెండర్ 90 మరియు డిఫెండర్ 110 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉటుంది. ఈ రెండు వేరియంట్లు ఒక్కొక్కటి 5 ట్రిమ్స్ లో లభిస్తాయి. కాబట్టి మీరు డిఫెండర్ 90 మరియు 110 ల మధ్య తేడా ఎలా గుర్తిచాలా అనుకుంటే.. ఇది చాలా సింపుల్, డిఫెండర్ 90 3-డోర్స్ వేరియంట్ మరియు 110 5-డోర్స్ వేరియంట్. అయితే ల్యాండ్ రోవర్ తరువాత దశలో డిఫెండర్ 90 ను భారతదేశంలో విడుదల చేయనుంది.

షోరూమ్‌లలో ఉన్న రెండు వాహనాలు డిఫెండర్ ఎస్‌ఇ మరియు డిఫెండర్ ఫస్ట్ ఎడిషన్. మొదటి ఎడిషన్‌లోని బ్లాక్-అవుట్ బ్యాడ్జ్‌లతో ‘పాంగీయా గ్రీన్’ కలర్ ని మేము చాలా ఇష్టపడ్డాము.