కొత్త 2021 బిఎస్6 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన కెటిఎమ్

2020-10-09 9

ఆస్ట్రియన్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త 2021 890 అడ్వెంచర్ ఆర్ మరియు లిమిటెడ్ ఎడిషన్ 890 అడ్వెంచర్ ర్యాలీ ఆర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కెటిఎమ్ 790 అడ్వెంచర్ మోడల్ డిజైన్ మరియు స్టైలింగ్ నుండి స్పూర్తి పొంది తయారు చేశారు.

కొత్త 2021 కెటిఎమ్ 890 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు రెండూ కూడా కొత్త బిఎస్6 ఇంజన్ అప్‌డేట్‌తో పాటుగా కొత్త ఫ్రేమ్ కలిగి ఉంటాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకేరకమైన ఇంజన్ ఉంటుంది. ఇందులోని 889సిసి, పారలల్-ట్విన్ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 103 బిహెచ్‌పి శక్తిని, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 100 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను కెటిఎమ్ డ్యూక్ 890 మోడల్ నుండి గ్రహించి, రీట్యూన్ చేశారు.