బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత : రేవంత్‌ అరెస్ట్‌

2020-10-01 5,190

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నేత అనిల్‌ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.