టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు

2020-09-22 34

టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ధరలను సైలెంట్‌గా తగ్గించింది. అయితే, ఈ ధరల తగ్గింపు కేవలం ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్‌ను బట్టి రూ.40,000 వరకు ధరలు తగ్గాయి.

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ (ఆప్షనల్). డీజిల్ బేస్ వేరియంట్ ఎక్స్ఈ మినహా మిగిలిన అన్ని డీజిల్ వేరియంట్‌లపై ధరలు తగ్గాయి. ధరలు తగ్గిన తర్వాత, టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.99 లక్షల నుండి రూ.9.09 లక్షల మధ్యలో ఉన్నాయి.