చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల ధరను పెంచింది. బిఎస్ 6 అప్‌డేట్ తర్వాత తొలిసారిగా కంపెనీ రెండు బైక్‌ల ధరలను పెంచింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధరను 8వేలు అదేవిధంగా కాంటినెంటల్ జిటి 650 ధర 9 వేలు పెంచారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఆరెంజ్ క్రష్, సిల్వర్ స్పెక్టర్, మార్క్ త్రీ, రవిషింగ్ రెడ్, బేకర్ ఎక్స్‌ప్రెస్ మరియు టాప్-స్పెక్ గ్లిట్టర్ అండ్ డస్ట్ వంటి కలర్స్ లో అందించబడతాయి. మోటారుసైకిల్స్ యొక్క అన్ని కలర్ ఆప్షన్లకు సుమారు రూ. 1,800 ధరను పెంచారు. ధరల పెరుగుదల తరువాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 రూ .2.66 లక్షల నుండి 2.87 లక్షల వరకు ఉంటుంది.