కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ. 25,000

2020-08-21 880

కొరియా కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ఈ మోడల్‌ను అందరి కన్నా ముందు సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు 25,000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే నెల ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కియా మోటార్స్‌కు సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మూడవ ఉత్పత్తిగా విడుదల కానుంది.