భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

2020-08-20 655

ఇటాలియన్ మోటార్‌సైకిల్‌ బ్రాండ్ డ్యుకాటి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమ కొత్త 'డ్యుకాటి పానిగాలే వి2' టీజర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. టీజర్ వీడియో తర్వాత ఈ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. కాగా, తాజాగా పానిగాలే వి2 మోటార్‌సైకిల్‌ను ఆగస్ట్ 26, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేస్తామని డ్యుకాటి ధృవీకరించింది.

సెప్టెంబర్ నెల నుంచి డ్యుకాటి పానిగాలే వి2 డెలివరీలు ప్రారంభం అవుతాయని అంచనా. కాగా, డ్యుకాటి డీలర్లు ఇప్పటికే రూ.1 లక్ష అడ్వాన్స్‌తో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం డ్యుకాటి అందిస్తున్న ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ 959 పానిగాలే స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్త పానిగాలే వి2 మోటార్‌సైకిల్ మార్కెట్లోకి రానుంది.

Free Traffic Exchange