పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధర - వివరాలు

2020-07-25 31

చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ అపాచీ RR 310 ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ ఏడాది ఆరంభంలో టీవీఎస్ అపాచీ RR 310 బైక్‌ను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత దీని ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

కొత్త టీవీఎస్ అపాచీ RR 310 మోటార్‌సైకిల్‌ను కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు అదనంగా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. తాజా ధర పెంపు తర్వాత ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 2.45 లక్షలు.
పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధర గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Videos similaires