హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

2020-07-23 37

ద్విచక్ర వాహన హెల్మెట్ భద్రతా ప్రమాణాల కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు బ్యూరో పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫారిన్ హెల్మెట్ల అమ్మకాలను కూడా సెప్టెంబర్ 2020 నుండి అనుమతించనున్నట్లు బ్యూరో తెలిపింది.
మోటార్‌సైక్లిస్టులు ధరించే హెల్మెట్లు 1.2 కిలోల బరువు పరిమితిని మించకుండా ఉండాలని 2018లో జారీ చేసిన నిబంధనలను ఎత్తివేస్తామని బ్యూరో తెలిపింది. ఫలితంగా, మన దేశంలో విదేశీ బ్రాండ్ల హెల్మెట్లను విక్రయించేందుకు మార్గం సులభం కానుంది.