స్కొడా కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ ప్రారంభం

2020-07-23 50

కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపివేసింది. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా ప్రజలకు ఇళ్లకే పరిమితమై, బయటకు రావటం మానేశారు. ఫలితంగా వారి వాహనాలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యాయి. ఇటీవలి లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో, ప్రజలు బయటకు రావటం, విధులకు వెళ్లటం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇది వర్షాకాలం మరియు వాహనాలు చాలా కాలంగా ఇళ్ల వద్దనే నిలిపి వేసి ఉంచడం వలన వాటిని ఉపయోగించడానికి ముందు ఓసారి సర్వీస్ చేయించుకోవటం లేదా తనిఖీ చేయించుకోవటం మంచిదని ఆటోమొబైల్ నిపుణలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో కూడా తమ కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ చెకప్ క్యాంప్‌ను ప్రారంభిచింది. లాక్‌డౌన్ కారణంగా ఈసారి సర్వీస్ క్యాంప్‌కి అధిక సంఖ్యలో కార్లు వస్తాయని భావిస్తున్నారు.