కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

2020-07-10 186

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్ ఇండియా బిఎస్-6 కంప్లైంట్ ఎక్స్-బ్లేడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్-6 మోటారుసైకిల్ రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి సింగిల్-డిస్క్ మరియు డబుల్ డిస్క్ వేరియంట్లు. ఈ రేడు వేరియంట్లు అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటాయి.

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్-6 మోటారుసైకిల్ ప్రారంభ ధర రూ. 1.05 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందించబడుతుంది. కొత్త మోటారుసైకిల్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో తెరిచి ఉన్నాయి. ఈ కొత్త బైక్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.