బిఎస్ 6 హోండా లివో బైక్ : ధర & ఇతర వివరాలు

2020-07-01 389

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారత మార్కెట్లో మరో కొత్త బిఎస్6 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. హోండా నుంచి లభ్యం కానున్న ఈ ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ 'హోండా లివో' బిఎస్ 6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హోండా బిఎస్6 లివో మోటార్‌సైకిల్‌తో మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌డేట్స్ ఉన్నాయి.

ఇందులో హోండా పిజిఎం-ఫై (ఫ్యూయెల్-ఇంజెక్షన్) సిస్టమ్‌తో అప్‌డేట్ చేసిన బిఎస్6-కంప్లైంట్ 110 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంకా ఉందులో ఇఎస్‌పి (ఎన్‌హ్యాన్స్డ్ స్మార్ట్ పవర్) సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఈ రెండు టెక్నాలజీల కలయితో రూపొందింన బిఎస్6 ఇంజన్ ఇప్పుడు మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని మరియు మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది.