మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి

2020-06-24 57

మారుతి సుజుకి అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు 'ఎస్-ప్రెస్సో'లో కంపెనీ సిఎన్‌జి వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ అమర్చిన ఎస్-ప్రెసో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ. 4.84 లక్షలు రూపాయలు.

మారుతి సుజుకి దేశీయ విపణిలో విక్రయిస్తున్న సిఎన్‌జి కార్లలో ఎస్-ప్రెస్సో సిఎన్‌జి తాజాగా వచ్చి చేరిన కొత్త మోడల్. కంపెనీ ఇప్పటికే వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా, మొదలైన మోడళ్లలో కూడా సిఎన్‌జి పవర్డ్ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఓ) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.