Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : ALARINCHAGAAA
పల్లవి : అలరించగ, శ్రీ వేంకటపతిని అవతరించెను, మన అన్నమయ్యా "2"
అ.ప : కరనాడున, అల విఠలుని సేవింప ఇల పురంధరుడు జనియించెను "అలరించగ"
చరణం : విష్ణు తేజము ఘన అన్నమయ్యది
పురంధరునిది మరి బ్రహ్మ తేజమే "2"
వీరి కలయిక కలిగె జగతి కానందమె
ఆనందమే, పరమానందమే "అలరించగ"
చరణం : కర్ణాటక, మణి మాణిక్యములు
పురంధరుని విరచితములు, ఎనలేని కీర్తనలు "2"
ఆంధ్ర దేశపు పసిడి పచ్చల హారములు "2"
అన్నమయ్య కృతుల శ్రంగారములు "అలరించగ" "2"
చరణం : అన్నమయ్య పురంధరుని భావనలు
ఎల్ల జగతికి నిండు దీవెనలు "2"
ఇరు తేజములు ఇలను ఒక్కటైనవి "2"
భక్తి మార్గము యిక సుళువైనది "అలరించగ"