Elalona - Kanakesh Rathod

2020-05-13 4

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : ELALONA

పల్లవి : ఇలలోన, స్వర్గ, సుఖములు ఎదురైన
మదిలోన విడువక, నిన్ను నమ్మితి "2"

అ.ప : ముజ్జగమ్ముల ఏలిక, నీవంటు నమ్మితి దేవరా "2"
నిన్నేనానెర నమ్మితి, హరీ "ఇలలోన"

చరణం : మోక్షమును కోర, కాంక్షయె లేదు
ముమ్మారు, నీ నామమె నమ్మితి
భవపాశమ్ములు, నన్ను, మరి, పెనవేసిన
నీదరిని జేరుట, గతియని నే నమ్మితి "ఇలలోన"

చరణం : పలుకుటే ఎరుగని, మూగ జీవులు
నిరతము నిన్నే మనమున ధ్యానించును
మాటలను, బింకమును, నేర్చిన వాడను
నిన్నేల, స్మరియింపగ, మరచెద నేను "ఇలలోన"