Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : ANANDAM
పల్లవి : ఆనందం, జగదానందం
సహస్ర దీపం, సంధ్యా సమయం [2]
చరణం : ఉభయ దేవేరీ సహితుండై
కొలువు దీరెను, వేంకట రమణుడు [2]
సహస్ర ప్రభల, కాంతి వెలుగులో [2]
వెలిగేనూ, చిన్మయ రూపుడు [ఆనందం]
చరణం : అజ్ఞానమను దివ్వెలలో
సుజ్ఞానమనే తైలము నింపి [2]
వెలుగు దివ్వెలు, ప్రోలెను ఆత్మలు [2]
కాంతులీను, శ్రీ కాంతుని జూడగ [ఆనందం]
చరణం : ముగ్ధ మోహనుడు, శ్రీ వేంకటేశుడు
ఓర జూపుల, మురిపించె సతుల [2]
మరిపించె అలుకలు, ముత్యపు నగవుల [2]
శోభిల్లె, జగమూయలకాగా [ఆనందం]