MS Dhoni Greatest Finisher I Have Seen - Mike Hussey

2020-05-01 173

Former Aussie player and the current batting coach of Chennai Super Kings, Michael Hussey feels MS Dhoni can still play for Team India.
#MSDhoni
#DhoniRetirement
#MikeHussey
#ChennaiSuperKings
#IPL2020
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై స్పందించాడు. ధోనీలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, అతనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉంటే మహీకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందన్నాడు.
'ఎంఎస్ ధోనీ ఆటపట్ల అంకితభావం ఉన్న ఆటగాడు. ఒక టోర్నమెంట్‌కు మాన‌సికంగా, శారీర‌కంగా ఎలా సిద్ధ‌మ‌వ్వాలో, దానికి ఏం కావాలో అతనికి బాగా తెలుసు. ఐపీఎల్‌లో రాణించేందుకు అతను చాలా కష్టపడ్డాడు. మునపటి ఫామ్ అందుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ అతను ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే.. సెలెక్టర్లు కూడా ధోనీని కావాలనుకుంటే భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడు.'అని ఈ చెన్నై బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.

Videos similaires