Shoaib Akhtar reveals how he would dismiss Virat Kohli

2020-04-17 95

Shoaib Akhtar Comes Up with Two Plans to Dismiss Virat Kohli
#viratkohli
#akthar
#shoaibakthar
#kohli
#cricket
#instagram

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. కోహ్లీ ఇప్పటికే 43 వన్డే సెంచరీలు, 27 టెస్ట్ శతకాలు సాధించాడు. కోహ్లీని ఎలా పెవిలియన్ పంపాలా అని ప్రతి క్రికెట్ జట్టులోని చాలా మంది పేసర్లు, స్పిన్నర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే టీమిండియా కెప్టెన్‌ను తానైతే ఎలాంటి బంతులతో బోల్తా కొట్టిస్తానో తాజాగా వివరించాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.