India Lock Down: Mukesh Ambani to Ratan Tata, Have A Look How Corporate India Helping by Donations

2020-03-30 8,999

Here's a look at how corporate India is helping the government Current outbreak by donating crores of rupees and medical equipment and opening hospitals.
#IndiaLockDown
#CorporateIndiaDonations
#RatanTata1500crores
#MukeshAmbani
#Businesstycoons
#pmmodi

కరోనా మహమ్మారిపై పోరుకు పారిశ్రామిక వర్గాలు ముందుకు వచ్చాయి. పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. నిధుల రూపంలో లేదా మెడిసిన్ లేదా ఇతర రూపాల్లో సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్లాంట్‌లలో వెంటిలెటర్లు ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద మొత్తంలో సహకరానికి ముందుకు వచ్చింది.కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎధుర్కొంటున్న తరుణంలో టాటా సంస్థ రూ.1,500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం కోసం టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు, టాటా సన్స్ సంస్త తరఫున రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు రతన్ టాటా వెల్లడించారు. కఠినమైన ఈ సవాల్‌ను మానవాళి ఎదుర్కొంటోందని, ఈ సంక్షోభం సమయంలో వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆధుకునేందుకు టాటా ట్రస్ట్ కట్టుబడి ఉందని చెప్పారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షక కవచాలు, రోగులను టెస్ట్ చేసేందుకు అనువైన కిట్లు, ఆధునిక సౌకర్యాలు అందించడానికి, ప్రజలకు, ఆరోగ్య కార్యకర్తల కోసం రూ.500 ఖర్చు పెడతామని తెలిపారు రతన్ టాటా . కరోనా నియంత్రణ కోసం టాటా ట్రస్ట్ ఖర్చు చేసే రూ.500 కోట్లకు తమ సంస్థ అదనంగా రూ.1,000 కోట్లు ఇస్తుందని చంద్రశేఖరన్ తెలిపారు.