IPL 2020 Postpone : Matches Behind Closed Doors Consequences

2020-03-13 36

IPL 2020 is scheduled to start from March 29 with defending champions Mumbai Indians taking on Chennai Super Kings at the Wankhede Stadium in Mumbai.
But The start of IPL 2020 has been pushed back to April 15 following the global concern over the COVID-19 (novel coronavirus) outbreak
#IPL2020postponed
#coronavirus
#MatchesBehindClosedDoors
#IPLBehindClosedDoors
#BCCI
#IPLFranchises
#IPLGoverningCouncil
#IPL2020April15
కరోనా(కోవిడ్‌-19) ఎంత పని చేసింది. మనుషుల్ని మింగేయడంతో పాటు ఒక్కో రంగాన్ని ముంచేస్తోంది. ఈ ప్రాణంతక వైరస్ దెబ్బకు పర్యాటక, వర్తక, వాణిజ్య, ఆర్థిక రంగాలే కాదు... క్రీడల రంగం కూడా కునారిల్లుతోంది. ఇప్పుడు ఈ వైరస్‌ సెగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు తగిలింది. ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్‌ మెరుపులతో అలరించిన ఈ లీగ్‌ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. మొత్తం మీద ఆట సాగినా... మునుపటిలా జరగనే జరుగదు. కళ తప్పిన 'షో'గా ఇంకా చెప్పాలంటే గేట్లన్నీ మూసేసి గుట్టుగా... గప్‌చుప్‌గా నిర్వహించే పరిస్థితి తీసుకొచ్చింది.