Pak Cricket Board (PCB) on Thursday suspended Umar Akmal for breaching its Anti Corruption Code with immediate effect. The suspension comes hours ahead of the start of the Pak Super League (PSL) 2020.
#UmarAkmal
#PCB
#PSL2020
#PakCricketBoard
#AntiCorruptionCode
#spotfixing
#NationalCricketFederation
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పీసీబీ అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు ఉమర్ అక్మల్ ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేదు.