Delhi Exit Poll Result 2020 : Arvind Kejriwal Likely To Lead Again!

2020-02-08 2,051

Delhi Exit Poll Result 2020 :India Today-Axis My India survey predicts AAP sweeping West Delhi, North West Delhi, North East Delhi. Despite the spirited election campaign by Aam Aadmi Party Bharatiya Janata Party and Congress, voter turnout remained dismal on poll day in Delhi.
#DelhiExitPolls
#DelhiExitPollResult
#DelhiExitPollResult2020
#DelhiExitPollsurvey
#indiatodaydelhiexitpolls
#DelhiAssemblyElections2020
#delhipolls2020
#arvindkejriwal
#PMNarendraModi
#rahulgandhi
#yogiadityanath
#AAP
#Congress
#BJP
#delhiassemblyexippolls
#delhiexitpolls


యావత్ దేశ పరిపాలనకు కేంద్రబిందువుగా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తిన కిరటీధారిగా మరోసారి ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవిర్భవించనున్నారు. కేజ్రీవాల్.. వరుసగా రెండోసారి ఢిల్లీముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనప్రాయమేనంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ లభించబోతోందని ఇండియా టుడే-మై యాక్సిస్ సర్వే అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడించింది. పశ్చిమ ఢిల్లీ, చాందినీ చౌక్, వాయవ్య ఢిల్లీ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధిస్తుంందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో 9 నుంచి 10, చాందినీ చౌక్‌ ప్రాంతంలో 9 నుంచి 10 స్థానాలను అవలీలగా గెలుచుకుంటుందని అంచనా వేసింది.