India Vs New Zealand 1st ODI : New Zealand star Ish Sodhi continued the leg-spinners' curse against Indian skipper Virat Kohli as he dismissed him clean bowled in the first ODI at Hamilton.
#IndiaVsNewZealand
#viratkohli
#indvsnz
#indvnz
#indvsnz1stodi
#shreyasiyer
#HenryNicholls
#shreyasiyercentury
#shreyasiyerhundred
#klrahul
#kedarjadhav
#mayankagarwal
#timsouthee
#shreyasiyerbatting
#klrahulbatting
#teamindia
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ బలహీనతపై న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ గురిచూసి దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ ఇస్ సోధీ తెలివిగా గూగ్లీని సంధించాడు. అయితే.. ఆ బంతిని రీడ్ చేయడంలో కోహ్లీ విఫలమవగా.. బ్యాట్ ఎడ్జ్ తాకుతూ వెనక్కి వెళ్లిన బంతి లెగ్ స్టంప్- మిడిల్ స్టంప్‌పై ఉన్న బెయిల్‌ని ఎగరగొట్టింది. బంతి వెళ్లిన తీరుకి కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు. మ్యాచ్‌లో ఇస్ సోధీ వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ వికెట్ పడగొట్టడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో రెండు సార్లు ఔటైన కోహ్లీపైకి.. బుధవారం తొలి వన్డేలో లెగ్ స్పిన్నర్ ఇస్ సోధీని ప్రయోగించిన టామ్ లాథమ్ ఫలితం రాబట్టాడు. దీంతో.. అగ్రశ్రేణి పేసర్లని సమర్థంగా ఎదుర్కోగల కోహ్లీ.. నామమాత్రపు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడి వికెట్ సమర్పించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.