India vs New Zealand ODI Series : Rohit Sharma Might Be Rested....

2020-02-03 712

IND vs NZ 5th T20I: Rohit Sharma did not take the field after injuring while batting in the fifth T20 against New Zealand.
India play the first game of the three-match ODI series on Wednesday. But Rohit Sharma may not play because of injury
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#RohitSharmainjury
#SpiritOfCricket
#IndiavsNewZealand
#ViratKohli
#rosstaylor
#KaneWilliamson
#IndVsNz
#IndVsNz5tht20
#jaspritbumrah
#RohitSharma
#SanjuSamson
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి జట్టుగా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విదేశీ గడ్డపై భారత జట్టు టీ20 సిరీస్‌లను మూడోసారి వైట్‌వాష్‌ చేసింది. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఏడు

పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ టీ20లో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. అతడి స్థానంలో 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్.. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ సమయంలో

అతని పిక్క కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్‌ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు.
కివీస్, భారత్ జట్ల మధ్య 50 ఓవర్ల ఫ్లార్మాట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నె 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఐదో టీ20ల్లో గాయపడిన రోహిత్.. వన్డే సిరీస్ ఆడటం

అనుమానంగా మారింది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి మరో రెండు రోజులు సమయం ఉండడంతో.. రోహిత్ కోలుకుంటాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.