India vs New Zealand 5th T20I : #SpiritOfCricket | Kohli & Williamson's Moment, Heart Touching Photo

2020-02-03 199

IND vs NZ 5th T20I: India and New Zealand on the field in the 5th T20 skippers Kane Williamson and Virat Kohli were spotted on the boundary lines,
together along with Rishabh Pant in their 12th man jackets.
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#RohitSharma
#SpiritOfCricket
#IndiavsNewZealand
#ViratKohli
#rosstaylor
#KaneWilliamson
#IndVsNz
#IndVsNz5tht20
#jaspritbumrah
#RohitSharma
#SanjuSamson
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుత విజయంతో చరిత్ర సృష్టించింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కనివిని ఎరుగని రీతిలో సాగిన కోహ్లీసేన జైత్రయాత్ర.. అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ ఫలితాలు సూపర్ ఓవర్‌తో తేలగా.. ఆఖరి మ్యాచ్ వాటికి తగ్గట్లుగానే సాగింది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆఖరి బంతి వరకు పోరాడిన భారత్ 7 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. ఇక తమకు అలవాటైన రీతిలో ఒత్తిడి జయించలేక ఆతిథ్య జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది.
అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. రోహిత్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన అతను దురదృష్టవశాత్తు చీలిమండ గాయంతో అర్థాంతరంగా వైదొలిగాడు. దీంతో వైస్ కెప్టెన్సీ హోదాలో కేఎల్ రాహుల్ టీమ్‌ను లీడ్ చేశాడు. అద్భుత కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుకాల ఉంటూ ఫీల్డింగ్ పోజిషన్‌లు మారుస్తూ ఓడిపోయే మ్యాచ్‌ను కూడా తన అద్భుత కెప్టెన్సీతో గెలపించాడు. ఇండియాకు ఉన్న అద్భుత బౌలింగ్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు.
మూడో టీ20లో గాయపడ్డ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చివరి మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. ఇక విశ్రాంతిలో ఉన్న కోహ్లీ.. రిజర్వ్ బెంచ్ ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి వాటర్ బాయ్ అవతారం ఎత్తగా.. న్యూజిలాండ్ తరఫున విలియమ్సన్ కూడా వాటర్ అందించాడు.
ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు బౌండరీ లైన్ దగ్గరు కూర్చున్నారు. ఈ సందర్భాన్ని కెమెరాలు క్లిక్‌మనిపించగా.. బీసీసీఐ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది.