Amaravati JAC gave a Chalo Assembly call on January 20 in the wake of assembly sessions and urged the farmers and women for large-scale mobilization of public to the Chalo Assembly.
#amaravathi
#jacleaders
#apcapital
#ysjagan
#chandrababunaidu
#naralokesh
#janasena
#pawankalyan
#apformers
మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీ ఇప్పటికే మూడు రాజధానుల కాన్సెప్ట్‌కి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. అటు హైపవర్ కమిటీ సైతం శుక్రవారం జగన్‌తో సమావేశమై తుది చర్చలు జరిపింది. ఈ క్రమంలో శనివారం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అనంతరం 20న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఏపీ రాజధానుల అంశంపై చర్చిస్తారు. ఐతే అసెంబ్లీ సమావేశం జరిగే రోజే పొలిటికల్ జేఏసీ చలో అసెంబ్లీకి పిలునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు పోలీసులు. అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందులు కలగకుండా భద్రతను మరింత పెంచబోతున్నారు.