Sourav Ganguly's "Love At First Site" On A Top Cricketer !

2020-01-03 50

The epic Test between India and Australia at the Eden Gardens in 2001 is always associated with the brilliant performances from VVS Laxman and Rahul Dravid. But, Harbhajan Singh, who bagged six wickets in the final innings, was no less with the ball as he ensured India crossed the line successfully.
#SouravGanguly
#HarbhajanSingh
#vvslaxman
#sachintendulkar
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia
ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చూసి ఫిదా అయ్యా. ఆ సమయంలో హర్భజన్‌ను చూసి 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌'గా అనిపించింది అని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో గెలిచిన ఆ టెస్ట్ మ్యాచ్‌ భారత క్రికెట్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ (59, 281), హర్భజన్‌ సింగ్ (7/123, 6/73) విజయంలో కీలక పాత్ర పోషించారు.
అలనాటి మధురానుభూతులు గంగూలీ తాజాగా గుర్తుచేసుకున్నారు. 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ అని అందరూ అంటారు. ఈడెన్‌లో 13 వికెట్లు తీసిన హర్భజన్‌ను చూస్తే అలాగే అనిపించింది. భజ్జీ బౌలింగ్‌ చూసి ఫిదా అయ్యా. భారత క్రికెట్‌లో అతడు మార్పు తెస్తాడని అప్పుడే నమ్మకం కలిగింది. ఆ తర్వాత అతను 700 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ 700 వికెట్లు తీయడంతో ఆశ్చర్యపోలేదు' అని గంగూలీ అన్నారు.
'హర్భజన్‌, అనిల్‌ కుంబ్లే భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు. ఇద్దరూ అత్యత్తమ స్పిన్నర్లు. టెస్టు క్రికెట్‌లో తమ ముద్ర వేశారు. వారిద్దరు ప్రత్యర్థులను పెవిలియన్‌కు చేర్చుతూ.. టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాతో 2001లో ఆడిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే ఆడాల్సి ఉంది. అయితే జంబోకు గాయం కారణంగా భజ్జీ జట్టులోకి వచ్చాడు. జవగళ్‌ శ్రీనాథ్‌, కుంబ్లే ఇద్దరు ప్రధాన బౌలర్లు ఆ మ్యాచ్‌లో ఆడలేదు. భజ్జీ కొత్త ఆటగాడు' అని దాదా పేర్కొన్నారు.
'ఆసీస్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు భజ్జీకి అంతగా అనుభవం లేదు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో భజ్జీని కొనసాగిస్తూ.. మరో స్పిన్నర్‌ను తీసుకున్నాం. తొలి మ్యాచ్‌లో రాహుల్‌ సంఘ్వి, రెండో టెస్టులో వెంకటపతి రాజు, చివరి మ్యాచ్‌లో కులకర్ణిని తీసుకున్నాం. కానీ.. వికెట్లు తీసింది మాత్రం భజ్జీనే. అతడు ఛాంపియన్‌లా బౌలింగ్‌ చేశాడు' అని గంగూలీ తెలిపారు.
'జట్టులోకి యువకులు వచ్చాక విజయాలపై నమ్మకం కలిగింది