Virat Kohli Congratulates Hardik Pandya On His Engagement With Natasa Stankovic

2020-01-02 118

Hardik Pandya announced his engagement with Serbian actress Natasa Stankovic in an Instagram post on Wednesday.
#HardikPandya
#HardikPandyaengagement
#ViratKohli
#NatasaStankovic
#rohitsharma
#klrahul
#yuzvendrachahal
#cricket
#teamindia

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ బాలీవుడ్‌ నటి, సెర్బియాకు చెందిన నటాషా స్టాన్‌కోవిచ్‌తో జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి కిస్ ఇచ్చాడు. ఆపై తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు. మరోవైపు తనకు హార్దిక్‌ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని తొడిగిన వీడియోను నటాషా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానుంది.
ఎటువంటి సమాచారం లేకుండానే పాండ్యా నిశ్చితార్థం చేసుకోవడంతో క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. హార్దిక్‌కు పలువురు క్రికెటర్లు విషెస్‌ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 'వాటే సర్‌ప్రైజ్‌ హార్దిక్‌' అంటూ ఓ ట్వీట్ చేసాడు. 'కంగ్రాట్స్‌ హార్దిక్‌. వాటే ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌. మీ భవిష్యత్తు బాగుండాలి. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పటికి ఉంటాయి' అని కోహ్లీ రాసుకొచ్చాడు.
టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు అభినందించారు