Virat Kohli Remembers U19 World Cup Days, And Praised Kiwis Players Batting !

2020-01-02 61

Virat Kohli has picked his New Zealand counterpart Kane Williamson as the standout performer of the 2008 ICC Under-19 World Cup even though the event was dominated by his team and gave the India skipper his first taste of stardom.
#ViratKohli
#U19WorldCup2008
#KaneWilliamson
#stevesmith
#ravindrajadeja
#rohitsharma
#cricket
#teamindia

2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో అప్పటి న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆట అద్భుతం. మిగతా బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్‌ భిన్నంగా ఉండేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని యువ టీమిండియా 2008 అండర్‌-19 టోర్నీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీస్‌లో కివీస్‌ను మట్టికరిపించిన కోహ్లీసేన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.
అప్పటి జ్ఞాపకాలను బుధవారం ఐసీసీ ఇంటర్వ్యూలో కోహ్లీ మరోసారి గుర్తు చేసుకుని కేన్‌ను ప్రశంసించాడు. 'విలియమ్సన్‌ను ఎదుర్కోవడం నాకు ఇప్పటికి గుర్తుంది. కివీస్ జట్టుకు అండగా నిలబడేవాడు. మిగతా బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్‌ సామర్థ్యం భిన్నంగా ఉండేది. కేన్‌ ఆట అద్భుతం. కేన్‌, స్టీవ్‌ స్మిత్‌ సహా ఆ ప్రపంచకప్‌ ఆడినవారిలో చాలామంది ప్రస్తుతం తమ తమ దేశాలకు ఆడుతున్నారు. నేను కూడా' అంటూ కోహ్లీ తెలిపాడు.
'ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ నా కెరీర్లో ముఖ్యమైన మైలురాయి. కెరీర్‌ను నిర్మించుకొనేందుకు ఆ మెగా టోర్నీ ఎంతో ఉపయోగపడింది. అందుకే నా హృదయం, మనసులో దానికి ప్రత్యేకమైన చోటుంది. అది ఇచ్చే అవకాశాన్ని గౌరవించడం, అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. రవీంద్ర జడేజా, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కూడా 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ ఆడారు.