Delhi weather : With a numbing cold continuing to sweep Delhi-NCR, the region is expected to record its second-coldest December since 1901,
the weather department said on Thursday.
#Delhiweather
#secondcoldestDecember
#weatherdepartment
#DelhiNCR
#చలిసీజన్
#cold
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా 118 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్రలో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు అంచనా వేస్తున్నామని వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. 1919,1929,1961,1997లలో మాత్రమే డిసెంబర్ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇప్పటికే అత్యల్పంగా 19.85 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైనట్టు వెల్లడించింది. డిసెంబర్ 31 నాటికి ఉష్ణోగ్రతలు 19.15 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
ఒకవేళ అదే జరిగితే ఢిల్లీ చరిత్రలో 1901 తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన రెండో డిసెంబర్ నెలగా ఈ డిసెంబర్ నెల నిలిచిపోతుందని వెల్లడించింది. ప్రస్తుత డిసెంబర్ నెలలో 14వ తేదీ నుంచి దాదాపు 13 రోజులు ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.