పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో చెలరేగిన ఆందోళనలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. నిన్న నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన వ్యక్తం చేసిన తరువాత, పోలీసులపై రాళ్ళు రువ్వడం మరియు కార్లు తగలబెట్టటం వంటి ఘటనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలు అదుపు చెయ్యటానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించిన కొద్దిమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
#CAA2019
#NRC
#CitizenshipAmendmentAct
#delhipolice
#పౌరసత్వసవరణచట్టం
#DelhiGate