Pawan Kalyan Launched Ee Manase Song From MisMatch

2019-12-02 944

Ee Manase from the film MisMatch was released by Pawan Kalyan. After releasing the song Pavan conveyed his best regards and congratulated the whole team.
#PawanKalyan
#EeManase
##MisMatch
#MismatchMovieSongs
#tholiprema

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది.
మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ..మనసే' పాటను పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈరోజు విడుదల చేసాడు. ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు. హీరో ఉదయ్ శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు.