Government Railway Police (GRP) personnel on Tuesday rescued a youth who was dangling from an overhead wire at tracks on Dabra railway station in Madhya Pradesh. Electricity was switched off on the route by officials to carry out the rescue operations safely.
#indianrailways
#madhyapradesh
#jhansi
#GovernmentRailwayPolice
#India
#Dabra
మధ్యప్రదేశ్‌లో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే విద్యుత్ స్తంభంపైకి ఎక్కి దానిపై వేలాడే హై ఓల్టేజ్ తీగలపై నడిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దబ్రా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తీగలపై నడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ దారిలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేసింది. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ హై ఓల్టేజ్ డ్రామాను చూసేందుకు ప్లాట్‌ఫాంకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. ఇక వారంతా చూస్తుండగానే ఈ వ్యక్తి తీగలపై వేలాడుతూ కొన్ని సర్కస్ ఫీట్లు చేశాడు. ఇక మరో ఇంజిన్‌లో చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడి కిందకు దించారు.