Congress high command may give T-PCC responsibilites ot MP Revanth reddy in place of Uttam kumar Reddy. After Huzurnager result congress may take srious steps to strenghten party in the state. Many senior leaders in race for pcc Chief post.
#RevanthReddy
#UttamkumarReddy
#TPCCChief
#Huzurnagerbypollresult
#congress
#congresshighcommand
#rahulgandhi
#telangana
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఘోర పరాభవం ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కొత్త సమస్యలకు కారణమవుతోంది. గతంలోనే పీసీసీ చీఫ్ మార్పు పైన చర్చ సాగినా.. ఉప ఎన్నిక తరువాత నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇప్పటికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హూజూర్‌నగర్ ఓటమితో పీసీసీ మార్పు తప్పనిసరి అంటూ కాంగ్రెస్ మరో వర్గం ప్రచారం చేస్తోంది. హూజర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉన్నట్లు ఎవరికి వారు తమ రాజకీయం చేసారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తమ్ ను ఓటమికి బాధ్యుడిని చేసే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని మార్చకపోతే..ఇక పార్టీకి భవిష్యత్ ఉండదంటూ కొందరు నేతలు అధినేత్రికి నివేదికలు సైతం పంపిస్తున్నారని ప్రచారం సాగుతోంది.