Rohit Sharma became only the 4th batsman to hit a double hundred in Test and ODI cricket when the newly-promoted Test opener got to the landmark in the ongoing Test between India and South Africa in Ranchi on Sunday.Rohit Sharma joins an elite list which has Sachin Tendulkar, Virender Sehwag and Chris Gayle. Notably, Rohit has scored 3 double hundreds in ODI cricket and holds the record for the highest score in the 50-over international format 264.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#Rohithsharma
#SachinTendulkar
#VirenderSehwag
#ChrisGayle
#rabada
#teamindia
#southafrica
#india
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత్ తరఫున సచిన్, సెహ్వాగ్‌లు మాత్రమే రెండు ఫార్మాట్లలో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు. ఇక వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఫార్మాట్‌లో తొలి వ్యక్తిగత ద్విశతకం నమోదు చేశాడు. 249 బంతుల్లో 28 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. సిక్స్‌తోనే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. డబుల్ సెంచరీని కూడా సిక్స్‌తోనే సాధించడం విశేషం. లంచ్ తర్వాత ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన తర్వాత టెస్టుల్లో కూడా ఆ మార్కును చేరిన తొలి క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.