During the second day of the ongoing second Test between India and South Africa in Pune, South Africa pacer Kagiso Rabada and wicket-keeper batsman Quinton de Kock were seen getting engaged in a heated exchange while Indian captain Virat Kohli and all-rounder Ravindra Jadeja ran an overthrow.
#indiavssouthafrica2ndTest
#kagisorabada
#quintondekock
#fafduplessis
#southafrica'stourofindia2019
#ravindrajadeja
#viratkohli
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆతిథ్య భారత్ జోరు కొనసాగిస్తోంది. రెండో రోజు శుక్రవారం ఆటలో అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ.. సఫారీలపై పైచేయి సాధించింది. రెండో రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ (254 నాటౌట్: 336 బంతుల్లో 33ఫోర్లు, 2సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (91), రహానే (59)లు తమదైన శైలిలో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్‌మన్ అలవోకగా బౌండరీలు బాదడంతో ప్రొటీస్ బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా స్టార్ పేసర్ కాగిసో రబడ. తొలిరోజు మూడు వికెట్లు తీసిన రబడ.. రెండో రోజు ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతనిలో అసహనం పెరిగింది.