Tik Tok Star Sonika kethavath Death After Bike Accident. The road accident occurred near the Ketrapalli Mandalam Korrapati toll gate in Nalgonda district. The accident occurred when a speeding bike collided with a bicycle.
#tiktok
#sonikakethavath
#tollywood
#sonikatiktok
#Sonika
#RipSonika
సోనికా కేతావత్... టిక్ టాక్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైజాగ్‌కు చెందిన ఈ బిటెక్ అమ్మాయి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోనికా కేతావత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడే సోనికా... ఇటీవల తన స్నేహితులతో కలిసి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బైక్ రైడింగ్ చేస్తూ వీడియో తీస్తుండటం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఇంత కాలం తన వీడియోలతో అలరించిన ఈ కుర్ర స్టార్ ఇక లేరనే విషయం చాలా మంది అభిమానులను బాధించింది, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.