Pro Kabaddi League 2019: Dabang Delhi Defeats Jaipur Pink Panthers, Puneri Paltan Defeats Gujarat

2019-08-06 2

Pro Kabaddi League 2019:Dabang Delhi defeated Jaipur Pink Panthers 35-24 to claim the top spot in the Pro Kabaddi League season seven points table.
#prokabaddileague2019
#prokabaddi2019
#DabangDelhi
#PuneriPaltan
#telugutitans

వరుసగా పాయింట్లు తేవడంతో జైపుర్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి జైపుర్‌ను ఆలౌట్‌ చేసిన డిల్లీ 29-17తో భారీ ఆధిక్యం సాధించింది. మరోవైపు జైపూర్ పేలవ ప్రదర్శన చేయడంతో.. చివరి వరకు ఆధిక్యాన్ని అలానే కొనసాగించిన ఢిల్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన డిల్లీ.. 21 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
సోమవారమే ఉత్కంఠ భరితంగా జరిగిన మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ 33-31తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆలస్యంగా పుంజుకున్న పల్టాన్‌కు ఇది వరుసగా రెండో విజయం. రైడింగ్‌లో పవన్‌ కడియాన్‌ (6), అమిత్‌ కుమార్‌ (5).. ట్యాక్లింగ్‌లో గిరీశ్‌ ఎర్నాక్‌ (6), మంజీత్‌ చిల్లార్ (4) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌ రైడర్లు సచిన్‌ (9), రోహిత్‌ (6) పర్వాలేదనింపించారు.