Anushka Sharma Emotional Post On Virat Kohli, Rohit Sharma's Issue

2019-07-26 177

After Rohit Sharma unfollowed Anushka Sharma and Virat Kohli, actor shared an emotional post on Instagram. The recent episode has cleared that everything is not going well between both the players and Indian dressing room.
#anushkasharma
#indvswi2019
#rohitsharma
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే వార్తలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో సెమీస్‌ ఓటమి తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తాయని ఇటీవల గుసగుసలు వినిపించాయి. విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్‌కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలు తప్పని కూడా బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు నిజమేననిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. కోహ్లీ, ఆయన భార్య అనుష్కశర్మలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అన్‌ఫాలో అయ్యారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్యా విభేదాలు నిజమేనని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.