ICC Cricket World Cup 2019 : Jasprit Bumrah Missed A Rare Record As Early Reached 100 Wickets Club

2019-07-03 2

ICC Cricket World Cup 2019:India defeated Bangladesh by 28 runs at Edgbaston in Birmingham on Tuesday and became the second team after Australia to qualify for World Cup 2019 semi-finals.
#icccricketworldcup2019
#indvban
#jaspritbumrah
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా బౌలింగ్ తురుపుముక్క‌, యార్క‌ర్ కింగ్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువ‌గా నిలిచాడే గానీ దాన్ని అందుకోలేక‌పోయాడు. త‌న తోటి స‌హ‌చ‌ర బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రికార్డుకు స‌మం చేసే అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో మంగ‌ళ‌వారం నాటి మ్యాచ్ సంద‌ర్భంగా చేతికి అందివ‌చ్చిన ఆ అవ‌కాశాన్ని జార‌విడుచుకున్నాడు. ఇక జీవితాలో ఆ ఛాన్స్ అత‌నికి ద‌క్క‌దు. త‌న కేరీర్‌లో ఆ అరుదైన రికార్డును అందుకోలేడు బుమ్రా.
ఇంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మైన రికార్డు ఏమిట‌ది? అతి త‌క్కువ మ్యాచుల్లో వంద వికెట్ల‌ను తీయ‌డ‌మే. ఇప్ప‌టిదాకా టీమిండియా త‌ర‌ఫున దీన్ని సాధించిన‌ది మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఒక్క‌డే. మొత్తం 56 అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచుల్లో ఈ ఘ‌న‌త‌ను సాధించాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో క‌లుపుకొని ష‌మీ ఇప్ప‌టిదాకా మొత్తం 66 అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 126 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రికార్డు ముంగిట్లో నిలిచాడు జ‌స్‌ప్రీత్ బుమ్రా.