ICC Cricket World Cup 2019 : Kohli And Rohith Meets India’s 87-year-old Super Fan Charu Lata

2019-07-03 464

India captain Virat Kohli and vice-captain Rohit Sharma went onto meet 87-year-old Charu Lata Patel after India defeated Bangladesh by 28 runs to reach the semi-finals of the 2019 Cricket World Cup.Virat Kohli also tweeted an image with Charu Lata Patel, thanking her for immense support and saluting her passion and dedication as a fan.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsbangladesh
#viratkohli
#rohithsharma
#charulatapatel
#edgbaston
#birmingham

సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లు కొన‌సాగుతున్న‌ప్పుడు- కెమెరాల కంటిని ఆక‌ర్షించ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు ప్రేక్ష‌కులు. చిత్ర‌, విచిత్ర‌మైన విన్యాసాలు చేస్తుంటారు. కెమెరాల‌ను ఆక‌ర్షించేలా ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. మ‌రికొంద‌రైతే- ఏకంగా మ్యూజిక‌ల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను కూడా వెంట తెచ్చుకుంటుంటారు. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో మంగ‌ళ‌వారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా.. ఇలాంటి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండానే ఓ వ‌యోధిక వృద్ధురాలు కెమెరా కంటిని ఆక‌ట్టుకున్నారు. ఎంత‌గా అంటే- గ్యాప్ వ‌చ్చిన ప్ర‌తీసారీ కెమెరామెన్ ఆ పెద్దావిడ‌ వైపే త‌న ఫోక‌స్ పెట్టేంత‌గా! మ్యాచ్ ఆరంభం నుంచీ కెమెరా క‌ళ్ల‌న్నీ ఆమె చుట్టే తిరిగాయి.